![]() |
![]() |

జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి... సెలెబ్రిటీ టాక్ షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం డాన్స్ మాష్టర్ ప్రభుదేవాతో చిట్ చాట్ చేశారు జగ్గు భాయ్. "మీ బ్రదర్ రాజు సుందరం నాతో ఫస్ట్ సాంగ్ చేసాడు. ఒక గంట రెండు గంటలు చూసాడు నా డాన్స్ ని. వీడు వేస్ట్..వీడికి డాన్స్ రాదు ఏమీ రాదు మ్యూజిక్ లేదు ఈ బాడీలో నేను చేయను అన్నాడు. అచ్చంగా ఇలాగే చెప్పాడు. అప్పుడు ఊరుకుని సాయంత్రం క్లాస్ పీకా. నువ్వు మాష్టర్ వి. నేర్పే బాధ్యత నీది. నాకు రాలేదు అంటే వచ్చే వరకు నువ్వు ట్రై చెయ్యి నేను చేస్తాను అని చెప్పి అప్పటి నుంచి నేను అతను మంచి ఫ్రెండ్స్ ఐపోయాం. సరే నువ్వు చెప్పు నాకు డాన్స్ వస్తుందా రాదా" అని జగపతి బాబు ప్రభుదేవాకి అడిగారు. "అలా అని కాదు. ఎనీ బాడీ కెన్ డాన్స్" అని చెప్పాడు ప్రభుదేవా.
ఇక చిరంజీవితో ఫస్ట్ సాంగ్ గురించి చెప్పుకొచ్చారు ప్రభుదేవా.."అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీలో మెరుపులా సాంగ్ కి కంపోజ్ చేసాను. అప్పటికి నా వయసు 14 , 15 స్కూల్ వెళ్తూ ఉన్నాను. అప్పటికి అంత సీరియస్ నెస్ తెలీదు నాకు. మా నాన్న దగ్గర అసిస్టెంట్ గా చేసేవాడిని. నేను స్టెప్స్ చూపించేసి వెళ్లి నాన్న ఒళ్ళో కూర్చునేవాడిని. ఒకసారి నేను ఆడుతున్నాను. ఆయన కూడా డాన్స్ చేసేస్తున్నారు. బాహాయంకరంగా ఆడుతున్నారే అనుకున్నా. ఆ తర్వాత ఆయన వీడియోస్ అన్నీ చూసాను. ఆయనకు మంచి డాన్సర్ అప్పటికే. నేను చిరు సర్ వల్లనే అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాను. ఆయనకు చిన్నా, పెద్ద అన్న తేడా ఉండదు. అలాగే చాల హార్డ్ వర్క్ చేస్తారు. ఇలా చెప్పగానే అలా పట్టేస్తారు. అబ్బని తియ్యని దెబ్బ సాంగ్ ని నాన్న కంపోజ్ చేశారు. నేను అసిస్టెంట్ గా ఉన్న. ఒక రోజు నన్ను కొన్ని స్టెప్స్ వదిలేసి వెళ్లారు. దాన్ని నేను పూర్తి చేసాను. అది డ్యూయెట్ సాంగ్. అది చేయడం ఎలానో నాకు అప్పటికి తెలీదు." అని చెప్పారు. "నిజానికి నేను విన్నది ఏంటంటే ఆ సాంగ్ ని వద్దు అనుకుని మళ్ళీ దాన్ని పెట్టారని తెలుసు. కానీ తర్వాత ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది" అంటూ జగపతి బాబు చెప్పుకొచ్చారు. "ఐతే ఆ విషయం నాకు తెలీదు. అది హిట్ అవుతుందని డైరెక్టర్ సర్ కి తెలుసో ఏమో అందుకే సాంగ్ ని మళ్ళీ పెట్టారు" అని ప్రభుదేవా చెప్పారు. "నీది చాలా చిన్న వయసు కాబట్టి అప్పటికి నీకు శ్రీదేవి గారి అందం కూడా తెలిసి ఉండదు కదా" అని జగ్గు భాయ్ అనేసరికి "లేదు తెలీదు..నేను నా లోకంలో అలా ఉండేవాడిని " అని చెప్పారు ప్రభుదేవా.
![]() |
![]() |